Fact Checked

గర్భస్రావానికి చిట్కాలు మరియు వైగ్యానిక పద్ధతులు

Image: Shutterstock

IN THIS ARTICLE

గర్భం ధరించటం అన్నది కావాలని కోరుకున్నప్పుడు జరిగితే, నిజంగా ఒక వరమే. కానీ అనుకోకుండా, ప్లానింగ్ లేకుండా గర్భం వస్తే అది ఒక సమస్యగా మారవచ్చు. అలా అనుకోకుండా గర్భం వచ్చినప్పుడు, దానిని ఉంచుకుని ముందుకి వెళ్దాం అని అనుకోవచ్చు లేదా దాన్ని తీసుకోవాలి అని నిర్ణయించుకోవచ్చు.

ఒకవేళ మీరు గర్భస్రావం (abortion) చేయించుకుందాం అని అనుకుంటే గనుక, ఇంటి చిట్కాలతో అబార్షన్ జరిగే పద్ధతులు కొన్ని ఉన్నాయి. లేదా ఆసుపత్రిలో సురక్షితంగా వైద్యులు చేసే పద్ధతులు ఉన్నాయి.

మామ్ జంక్షన్ ఇక్కడ సానుకూలమైన గర్భస్రావ విధానాలు తెలియచేస్తోంది. అవసరమైతే, అవి ప్రయత్నించవచ్చు. కానీ ముందుగా పాటించవలసిన జాగ్రత్తలు తెలుసుకోవాలి.

పాటించవలసిన కొన్నిజాగ్రత్తలు

ఇంటి చిట్కాలు గర్భాన్ని తొలగించుకునేందుకు పనికివస్తాయి. కానీ అవి వంద శాతం సురక్షితం కావు. అందువల్ల తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 • డాక్టర్ని సంప్రదించ కుండా ఏ రకమైన పద్ధతీ వాడకూడదు. నిష్ణాతుల సలహా ఖచ్చితంగా ఉండాలి.
 • ముందుగా “సంభవించిన గర్భం వద్దు” అని గట్టిగా నిర్ణయించుకోవాలి. అప్పుడే గర్భస్రావం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఒకసారి ఈ విధానంలో కొంచెం ముందుకెళ్లాక, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అది ప్రమాదకరం కూడా.
 • గర్భం ధరించి పది వారాలపైనే అయితే, చిట్కాలు వాడి గర్భం పోగొట్టుకోవటం మంచిది కాదు. అది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
 • మీ ఆరోగ్యం కూడా పరిపుష్ఠిగా ఉంటేనే, ఇంటి చిట్కాలు ప్రయత్నించవచ్చు. చిట్కాలు వాడినా కోరిన ప్రకారం గర్భస్రావం జరగలేదంటే, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

మీరు గనుక డాక్టర్ని సంప్రదించి, గర్భం వద్దు అని గట్టిగా నిర్ణయించుకుని ఉంటే, కింద ఇచ్చిన చిట్కాలను ప్రయత్నించవచ్చు.

గర్భస్రావానికి సహజమైన గృహ చిట్కాలు

గర్భం పది వారాల లోపుగా ఉంటే, కింద సూచించిన చిట్కాలు వాడి, గర్భం తొలగించుకునే ప్రయత్నం చెయ్యవచు. కానీ ముందు చెప్పినట్టుగా, ఇవి 100% పనికి వస్తాయి అని చెప్పలేము:

1 . బొప్పాసి కాయ

పచ్చి, ఆకుపచ్చని బొప్పాసి కాయలో పాపాయిన్ (papain) అనే ఎంజైమ్ గర్భస్రావానికి ఉపకరిస్తుంది. ప్రోస్త్రోజేన్ హార్మోన్ ని నిరోధించే శక్తి గల ఈ పండు గర్భ ధారణని నిరోధిస్తుంది. పచ్చి పప్పాయలో పాల వంటి ద్రవము ఆక్సిటోసిన్ మరియు ప్రోస్టాగ్ల్న్దిన్స్ (oxytocin and prostaglandins) వలన గర్భ సంచి సంకోచించే ప్రక్రియ జరిగి, గర్భస్రావం జ్జరుగుతుంది. పచ్చి బొప్పాయి ని వరుసగా తింటే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు (1) (2).

2 . అనాసకాయ (pineapple)

పచ్చిగా, ఆకుపచ్చగా ఉన్న అనాసకాయలో ఎక్కువగా ప్రోటోలైటిక్ ఎంజాయ్ (bromelain) ఉంటుంది. ఇది గర్భాశయాన్ని (cervix) మెత్తబరిచి, రక్తస్రావం జరిగేలా చేస్తుంది. పచ్చి అనాసకాయ ముక్కలు ప్రతిరోజూ తీసుకుంటే ఫలితం ఉండవచ్చు (3).

3. అకేషియా, అరటి రెమ్మలు

ఆకేషియా గింజలు, లేత అరటి చిగుళ్లు కలిపి తీసుకుంటే గర్భ స్రావం జరుగుతుందని ప్రతీతి. వైజ్ఞానికంగా సరైన కారణం తెలియలేదు కానీ, గర్భ విచ్చేదనకి పనికివస్తుందని పేరు. సమపాళ్లల్లో ఆకేషియా, అరటి చిగుళ్లు కలిపి పొడిచేసి, పంచదార కలిపిన నీటిలో కలుపుకుని రోజూ తాగితే సహజ గర్భస్రావానికి పనికొస్తుంది.

4.నువ్వులు ( తెల్లవి, నల్లవి)

నువ్వులకి గర్భస్రావ గుణం వుందంటారు. శరీరంలో వేడి పుట్టించి, తద్వారా గర్భాన్ని పోగొడుతుందని అంటారు. నువ్వుల పొడి, నువ్వుల లడ్డులు, ఇలా ఎదో ఒక రూపంలో నువ్వులు బాగా తింటే, సహజ గర్భస్రావానికి పనికొస్తుంది (4).

5. నల్ల జీలకర్ర

నల్ల జీలకర్రకి గర్భస్రావం కలిగించే లక్షణాలు ఉన్నాయని అంటారు. పెద్ద మొత్తంలో వీటిని తింటే, గర్భం తొలిగే అవకాశం ఉండొచ్చు. కానీ వీటిని ఎక్కువ పాలంలో తీసుకోవలసి ఉంటుంది (5).

6. పత్తి (కాటన్) వేరు బెరడు

పత్తి వేరుకి గర్భస్రావం కలిగించే లక్షణం ఉంది. కానీ ఇది శాస్త్రీయంగా రుజువు కాలేదు. దీనిని 100 గ్రాములని ఒక లీటరు నీటిలో వేసి బాగా మరగకాచాలి. ఆ ద్రవాన్ని తాగాలి (6).

7. కెఫిన్

ఎక్కువగా తాగితే, చిక్కని కాఫీ కూడా గర్భం నిలపకుండా చేస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్పలేము (7).

8. కేమోమైల్ టీ

ఎక్కువ మోతాదులో కేమోమైల్ తీసుకుంటే, గర్భవిచేదానికి దోహదం చెయ్యవచు. ఇందులో ఉన్న తుజోన్ అనే పధార్థం గర్భకోసం సంకోచించి, రక్తస్రావానికి సహకరిస్తుంది. కేమోమైల్ టీ ప్రతిరోజూ తాగుతుంటే ఫలితం దక్కవచ్చు. కేమోమైల్ నూనె యోనిలో పోస్తే కూడా అబార్షన్ జరిగే అవకాశం ఉంది (8).

9.ఆక్యుపంచర్ పాయింట్లు

Image: Shutterstock

SP6 పాదం నించి పైకి నాలుగు వేళ్ళ పైన ఆక్యుపంచర్ చేస్తే , అది గర్భస్రావానికి ఉపకరించవచ్చు. కానీ ఈ పని నిపుణులైన ఆక్యుపంచరిస్ట్ లచే చేయించుకోవాలి (9).

10. వ్యాయామం

శ్రమతో కూడిన వ్యాయామం అతిగా చెయ్యటం వలన, అంటే వంగి చేసేవి, అతిగా కాళ్ళు కదిపి చేసేవి, వేగంగా చేస్తేకూడా గర్భం నిలవదు. అలాగే మొదటి నెలలో గనుక రతిలో చాలా సార్లు పాల్గొంటేకూడా, ఆ అలసటతో అబార్షన్ అవుతుంది (10) (11).

పైన సూచించినవన్నీ గృహ చిట్కాలు. ఇవి పాటించినా గర్భం తొలగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. తొలగిపోకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి; అసలు పైవిధానాలు ఏవైనా వాడేముందు కూడా డాక్టర్ని కలిసి, సలహా తీసుకోవాలి. ఈ చిట్కాలు తప్పుగా వాడినా, ఎక్కువ మోతాదులో తీసుకున్నా సమస్యలు తలెత్తవచ్ఛును.

ఇంటి చిట్కాల కన్నా డాక్టర్ వద్దకు వెళ్లి వారు చెప్పిన ప్రకారం గర్భస్రావం చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఆ పద్ధతులు సురక్షితమైనవి కనుక.

గర్భస్రావానికి వాడే వైగ్యానిక పద్ధతులు

డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, వారు ఈ పద్ధతుల్లో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంది.

1.మెడికల్ అబార్షన్

మొదటి 7 -9 వారాల్లో అయితే మందులతో గర్భం పోగొట్టుకోవచ్చు. హాస్పిటల్లో చేరవలసిన పని లేదు కానీ డాక్టర్ని కనీసం మూడుసార్లైనా చూడాలి. డాక్టర్లు ఇచ్చే మందులలో రెండు రకాలు ఉండవచ్చు. ఒక రకం ప్రొజిస్ట్రాన్ అనే హార్మోన్ని నిరోధించడానికి, గర్భసంచి యొక్క గోడలని పలుచగా చెయ్యటానికి పనికి వస్తుంది (12).

రెండో రకం గర్భసంచి కండరాలు సంకోచించుకునేందుకు ఉపకరిస్తుంది. వీటి వలన రక్తస్రావం జరుగుతుంది.

గర్భస్రావం జరిగిన రెండు-మూడు వారాలు దాటాక, అల్ట్రా సౌండ్ పరీక్ష చేసి, పిండం పూర్తిగా పోయి, శుభ్రమైనదా లేదా అన్నది చూస్తారు. పూర్తిగా పోకపోతే, సర్జికల్ గా తొలగిస్తారు.

2 .సెలైన్ నీటి పద్దతి

ఈ పధ్ధతిలో ఉప్పు నీరు కలిపి గర్భాశయంలో కి సూది ద్వారా పంపుతారు (13). గాఢమైన ఉప్పు నీరు పిండాన్ని నశింపచేస్తుంది. ఫలితంగా రక్తస్రావం జరిగి, వ్యర్ధాలన్నీ బైటికి పోతాయి. కొన్ని కేసుల్లో రక్తస్రావం జరగకపోతే, ప్రోస్టాగ్లాన్దిన్ ఇంజెక్ట్ చేసి రప్పించాల్సొస్తుంది. ఇది కూడా పనిచేయకపోతే, సర్జికల్గానే తొలగించాల్సి వొస్తుంది.

3 . సర్జికల్ అబార్షన్

కొందరికి గర్భం ధరించాక, పిండం సరిగ్గా లేదని తెలిసినప్పుడు, ఎదుగుదల లేనపుడు, డాక్టర్లు సర్జరీ పద్దతిలోనే గర్భం తొలగిస్తారు. గర్భం పరిస్థితి, ఎన్ని వారాలు గడిచింది, మొదలైన అంశాల ఆధారంగా డాక్టర్లు సర్జికల్ పద్దతిలో గర్భస్రావం చేస్తారు. MVA అంటే, మాన్యూల్ వాక్యూమ్ ఆస్పిరేషన్ (manual vacuum aspiration) లేదా D&E (dilation and evacuation) పద్ధతులు వాడతారు. వీటికోసం లోకల్ మత్తు ఇవ్వాల్సివస్తుంది (14).

గర్భస్రావం విజయవంతంగా జరిగిందనే విషయం ఎలా నిర్ణయించవచ్చు?

గర్భస్రావం జరిగింది అని సూచనలు

కింద సూచించిన లక్షణాలు కనిపిస్తే, విజయవంతంగా అబార్షన్ జరిగింది అని తెలుసుకోవచ్చు. కానీ ఇవి అందరికీ వర్తిస్తాయని చెప్పలేము.

 • రక్తస్రావం జరుగుతుంది
 • నడుం నొప్పి కొందరిలో కొద్దిగా, మరికొందరిలో ఎక్కువగా ఉంటుంది
 • రక్తం ముద్దలుగా పోతుంది
 • పొత్తికడుపు లో నొప్ప (cramps) రావచ్చు

పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించి, అబార్షన్ సవ్యంగా జరిగిందని నిర్ధారించుకోవాలి. కొంచెం కూడా మిగిలి ఉంటే చాలా సమస్య. అసలు గర్భ విచ్చేదనలో ఎటువంటి సమస్యలు తలెత్తవచ్చొ చూద్దాం (15).

అబార్షన్ లో వచ్చే సమస్యలు

 • 100 డిగ్రీలు దాటి జ్వరం రావచ్ఛు
 • పొత్తికడుపు, నడుము నొప్పి బాగా రావచ్ఛు
 • గర్భాశయం దెబ్బతినొచ్చుఁ
 • గర్భసంచి డామేజ్ అయ్యి చిరుగులాంటిది ఏర్పడవచ్చుఁ
 • చెడు వాసనతో కూడిన రక్తస్రావం
 • రక్తస్రావము ఎక్కువగా కావటం
 • ఇన్ఫెక్షన్ సంభవించవచ్చుఁ

అబార్షన్ అనేది మానసికంగా, శారీరికంగా కూడా చాలా సున్నితమైన విషయం. దానినుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కోలుకునే లోపు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది.

అబార్షన్ అయ్యాక త్వరగా కోలుకోవాలంటే?

అబార్షన్ జరిగాక శరీరం మామూలు స్థితికి వచ్చినంత వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి (16):

 1. బరువైన వస్తువుల్ని ఎత్తకూడదు. అలా చేస్తే, రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
 1. ఎక్కువగా వ్యాయామం,సైక్లింగ్, పరుగెత్తటం, వంటివి చేయరాదు.
 1. జ్వరం తగలకుండా చూసుకోవాలి. జ్వరం తగిలితే ఇన్ఫెక్షన్కి సూచన కావచ్చు. కాబట్టి డాక్టర్ని సంప్రదించాలి.
 1. కొంత కాలం రతిలో పాల్గొనరాదు. ఇంకా నరాలు, టిష్యూలు సున్నితంగా ఉంటాయి.పైగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
 1. పొత్తికడుపు నొప్పి వస్తే, వేడినీటి బ్యాగుని లేదా ఉష్ణాన్నిచ్చే ఎలక్ట్రిక్ ప్యాడ్స్ని వాడి ఉపశమనం పొందవచ్చు.
 1. టబ్బులో స్నానం, ఈతకొట్టడం చెయ్యవద్దు. అందువల్ల దురదలు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు.
 1. కొంత కాలం వరకు యోనిలోకి వెళ్లే కుటుంబనియంత్రణ సాధనలేమీ వాడరాదు.
 1. పౌష్టికాహారం, మంచి పళ్ళు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. బాగా నీరు, పళ్ళ రసాలు తాగటం కూడా ముఖ్యమే.

అబార్షన్ అయ్యాక నెలకి ఒకసారి డాక్టర్ వద్దకి చెక్అప్ కి వెళ్ళాలి. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నదన్నది నిర్ధారించుకోవాలి. వద్దనుకునే గర్భం చాలా మానసిక వత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి, అబార్షన్ చేయించుకోవాల లేక గర్భాన్ని ఉంచుకోవాలా అన్న నిర్ణయం త్వరగా తీసుకుంటే మంచిది. ఆలస్యం అయినకొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి. డాక్టర్ల సలహాని ఖచ్చితంగా పాటించి ఆరోగ్యం పొందాలి.

మీ అనుభవాలని, సలహాలని మాతో పంచుకోవాలనుకుంటే, కామెంట్ రూపంలో తెలియచేయగలరు.

ప్రస్తావనలు

1. Ghosh Debosree and Ghosh Suvendu; Forbidden foods for healthy pregnancy; International Journal of Scientific Research and Reviews
2. Adebiyi A et al.; Papaya (Carica papaya) consumption is unsafe in pregnancy: fact or fable? Scientific evaluation of a common belief in some parts of Asia using a rat model; Br J Nutr (2002)
3. Monji F et al.; Investigation of uterotonic properties of Ananas comosus extracts; Journal of Ethnopharmacology (2016)
4. Maryam Yavari, et al.; Sesame a treatment of menstrual bleeding cessation in Iranian traditional medicine: results from a pilot study; Shiraz E Medical Journal
5. Vern L. Bullough et al.; Encyclopedia Of Birth Control; PSU
6. Aviva Romm; Botanical medicine for women’s health; ScienceDirect (2010)
7. Hahn KA et al.; Caffeine and caffeinated beverage consumption and risk of spontaneous abortion; Hum Reprod (2015)
8. Mansoor Ahmed et al.; Safety classification of herbal medicines used among pregnant women in Asian countries: a systematic review; BMC Complement Altern Med (2017)
9. Nasrin Asadi et al.; Effects of LI-4 and SP-6 acupuncture on labor pain, cortisol level and duration of labor; Journal of Acupuncture and Meridian Studies; ScienceDirect (2015)
10. A tentative link between exercise and miscarriage; NHS (2007)
11. Andrew Moscrop; Can sex during pregnancy cause a miscarriage? A concise history of not knowing; Br J Gen Pract (2012)
12. Medical Abortion; UCLA Health
13. Christina Raup; Abortion; The Embryo Project Encyclopedia (2016)
14. Induced Abortion Methods & Risks; South Dakota Department of Health
15. Risks – Abortion; National Health Service (NHS) (2016)
16. FAQ: Post-Abortion Care and Recovery; UCLA Health

 

The following two tabs change content below.