దేశభక్తి గీతాలు

ఎంద‌రో మ‌హానుభావుల త్యాగ‌ఫ‌లం మ‌న స్వాతంత్యం. తెల్ల దొర‌ల పాల‌నలో బానిస‌ల‌మై, ఆత్మాభిమానాన్ని చంపుకుని హీన‌స్థితిలో బ‌తుకుతున్న మ‌న‌కు ఎంద‌రో వీరులు త‌మ ప్రాణాల్ని సైతం ప‌ణంగా పెట్టి స్వేచ్ఛ‌ని ప్ర‌సాదించారు.

ఆ ఉద్య‌మ‌వీరుల‌ను నేటి త‌రాల‌కు గుర్తు చేస్తూ, వారి పోరాటాల‌ని, దేశంపై మ‌మ‌కారాన్ని పెంచేలా ఎన్నో దేశ‌భ‌క్తి గీతాలు వాడుక‌లో ఉన్నాయి. రేప‌టి పౌరుల‌కు త‌ప్ప‌కుండా తెలియాల్సిన దేశ‌భ‌క్తి గీతాలే అవ‌న్నీ. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా భార‌తావ‌నంతా పాడుకునే గీతాలు ఇవి. దేశ‌భ‌క్తి గీతాల‌పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ బాక్స్ లో రాయ‌డం మ‌రువ‌ద్దు.

 1. వందే మాతరం
  సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
  సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
  శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
  ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
  సుహాసినీం సుమధుర భాషిణీమ్
  సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
వందేమాతరం

రచన: బంకిం చంద్ర ఛటర్జీ

 1. జయ జయ జయ జన్మ భూమి
  జయ జయోస్తు మాతృ భూమి!!
  ఆదిరుషుల జన్మ భూమి – ఇది పవిత్ర భూమి
  ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం
  ఇది భారత ప్రజావళికి అసిధారా వ్రతము
  ఇది భారత జనావళికి పరీక్షా సమయము … జయ జయ!!
  గంగా గౌతమి కృష్ణల కన్నతల్లి భారతి
  కనక వర్షమొలికించే స్వర్గసీమ భారతి
  తల్లికి నీరాజాన మిడ తరలి రండి రండి
  రండీ రండీ రండీ రండీ
  జయ జయ జయ!!

రచన: సి నారాయణ రెడ్డి

 1. ఏ దేశ మేగినా – ఎందు కాలిడినా
  ఏ పీఠ మెక్కిన – ఎవ్వరేమనినా
  పొగడరా నీ తల్లి భూమి భారతిని
  నిలుపరా నీ తల్లి నిండు గౌరవమును
  ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో
  జనియించిన వాడనీ స్వర్గ ఖండమున
  ఏ మంచి పూవులన్ ప్రేమించి నావో
  నిను మోసే ఈ తల్లి కనక గర్భమున
  లేదురా ఇటువంటి భూదేవి ఎందు
  లేదురా మనవంటి పౌరులింకెందు
  సూర్యుని వెలుతురుల్ సోకునందాక
  ఓడల ఝండాలు ఆడునందాక
  అందాక గల ఈ అనంత భూతల్లిని
  మన భూమి వంటి చల్లని
  పాడరా నీ తెలుగు బాలగీతములు
  పాడరా నీ వీర భావగీతములు

రచన: గురజాడ అప్పారావు

 1. జయ జయ జయ ప్రియా భారత జనయిత్రి దివ్యధాత్రి
  జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
  జయ జయ సశ్యామల సుశ్యామచలా చేలాంచల
  జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
  జయమదీయ హృదయాశ్రయ లాక్షారుణ పదయుగళ !!జయ !!
  జయ దిశాంత గత శకుంత దివ్య గాన పారితోషణ
  జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
  జయమదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
  జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
  జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
  జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

 1. పిల్లల్లారా ! పాపల్లారా!! రేపటి భారత పౌరుల్లారా!!
  పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా—– ఉ (—–ఉ (పిల్లల్లారా)
  మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడూ।
  ఉన్నాడు, అతడున్నాడు
  మీ మనసులలో దేవుడు కొలువై ఉన్నాడూ!
  ఉన్నాడు, ఒదిగున్నాడు
  భారత మాతకు ముద్దుల పాపలు మీరేలే, మీరేలే
  అమ్మకు మీపై అంతులేని ప్రేమేలే। ప్రేమేలే!
  భారత దేశం ఒకటే ఇల్లు భారత మాతకు మీరే కళ్ళు, మీరే కళ్ళు
  జాతిపతాకం పై కెగరేసి జాతి గౌరవం కాపాడండి
  బడిలో బైటా అంతా కలిసి భారాతీయులై మెలగండి
  కన్యాకుమారి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండి
  వీడని బంధం వేయండి| | పిల్లల్లారా పాపల్లారా| |

రచన: డా. దాశరధి కృష్ణమాచార్యులు

 1. జయ జయ భారత జాతీయ – హృదయానందోత్సవ శుభసమయం
  ప్రియతమ భారత జనయిత్రి – చిర దాస్య విమోచన నవోదయం | |జయ | |
  పొద్దుపొడిచె లేవండోయి – నిద్ర విడిచి రారండోయి
  దిద్దిగంధములు దద్దరిల్లగా నిశ్వానము చేయండోయి | | జయ | |
  హిందు ముస్లిం క్రైస్తవ పారశీ ఏక వేదికను నిలువండోయ్
  జాతులెన్నైన దేశమొకటిని ఏక కంఠమున చాటండోయ్ | |జయ | |…

రచన: RSS గీతం

 1. అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే
  తెలంగాణము రాయలసీమయు కోస్తాప్రాంతపు తెలుగు దేశము॥
  ఆంధ్రులమైనా తమిళులమైనా ఉత్కళులైనా కన్నడులైనా మరాఠి యైన గుజరాతైనా పంజాబైనా బాంగ్లా యైనా॥
  వచనం: వందనమమ్మా వందనము వణక్కమమ్మా వణక్కం నమస్కార్ నమస్కార్ అస్సలాం అస్సలాం॥
  భాషలు వేర్వేరైనాగాని భావాలన్నీ ఒకటేనోయ్ జాతులు మతములు వేర్వేరైనా నీతులు అన్నీ ఒకటేనోయ్॥
  దేశాలన్నీ ఒకటే ఐతే ద్వేషాలేవీ ఉండవుగా బాలప్రపంచం భావి ప్రపంచం భావి భారత వారసులం॥

రచన: న్యాయపతి రాఘవ రావు

 1. తల్లీ భారతి వందనం। తల్లీ భారతి వందనం।
  నీ ఇల్లే మా నందనం। మేమంతా నీ పిల్లలం।
  నీ చల్లని ఒడిలో మల్లెలము – తలిదండ్రులను గురువులను
  ఎల్లవేళలా కొలిచెదమమ్మ – చదువుల బాగా చదివెదమమ్మా
  జాతి గౌరవం పెంచెదమమ్మా – కులమత భేదం మరచెదము
  కలతలు మాని మెలిగెదము- మానవులంతా సమానులంటూ
  సమతను మమతను పెంచెదము- తెలుగు జాతికి అభ్యుదయం
  నవభారతికే నవోదయం – తెలుగు జాతికి అభ్యుదయం
  నవ భారతికే నవోదయం – భావి పౌరులం మనం మనం
  భారత జనులకు జయం జయం – భావి పౌరులం మనం మనం

రచన: డా. దాశరధి

 1. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
  భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవన యానం చేసెదమా
  సాగరమేఖల చుట్టుకుని – సుర గంగ చీరగా మలచుకుని
  గీతాగానం పాడుకుని – మన దేవికి ఇవ్వాలి హారతులు !తేనెల!
  గాంగ‌ జటాధర భావనతో – హిమ శైల శిఖరమే నిలబ‌డగా
  ఆ — ఆ.. గల గల పారే నదులన్నీ – ఒక బృంద గానమే చేస్తుంటే !తేనెల!
  ఎందరో వీరుల త్యాగఫలం – మన నేటి స్వచ్ఛకే మూలబలం
  వారందరిని తలచుకుని – మన మానస వీధిని నిలుపుకుని !తేనెల!

రచన: అఖండ భారత్

 1. భారత దేశం మన జన్మ ప్రదేశం
  భారత ఖండం – ఒక అమృత భాండం
  నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం
  రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
  ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం
  దక్షిణాన నెలకొన్నది హిందుసముద్రం
  తూరుపు దిశా పొంగిపొరలే గంగాసంద్రం
  పశ్చిమాన అనంతమై సింధు సముద్రం
  ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
  రత్న గర్భ పేరుగన్న భారత దేశం
  ధీర పుణ్య చరితలున్న ఆలయశిఖరం
  సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం
  కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం
  కొండ కోన వాగు పాడు సంస్కృత గీతం
  గుండె గుండె కలుపు కొంటె సమరస భావం
  చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం

రచన: అఖండ భారత్ (ప్రేరణ గీతాలు)

 1. దేశం కోసం జీవిద్దాం – జీవితమంతా అర్పిద్దాం
  మనం మనం మహా గణం – మహా గణమ్మే ప్రభంజనం……. దేశం కోసం
  నేనొక్కడినని అనుకుంటే – నేతాజీ ఎట్లగుదువోయ్
  శివమెత్తక నువ్వు కూర్చుంటే – శివాజీ ఎట్లగుదువోయ్
  చీమల గుంపుల గమనిద్దాం – పక్షుల పయనం పరికిద్దాం
  నీటిన నిప్పుని రగిలిద్దాం – నింగిన చుక్కల శాసిద్దాం
  చరిత్ర లోని మహా పురుషుల ను -ప్రతినిత్యం స్మరిద్దాం………… మనం మనం ……
  భూతల స్వర్గములే – ఇక్కడ అందరు బంధువులే
  మనదంటే సరి లే – కాదంటే ఇక కుదరదులే
  ఇంటి దొంగలను గమనిద్దాం – ఇజాల నిజాల ఛేదిద్దాం
  రక్కసి మూకల గుర్తిద్దాం – రామ బాణమును సందిద్దాం
  చరిత్ర నేర్పిన గుణపాఠాలను – ప్రతినిత్యమ్ము పఠించుదాం ……… । మనం మనం …. .

రచన: వేణుగోపాల్

Was this information helpful?
thumbsupthumbsdown
The following two tabs change content below.

  LATEST ARTICLES